karthi: మరో బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్‌తో వస్తున్న కార్తీ

Sequel to Karthi blockbuster Sardar Movie confirmed
  • తమిళ్, తెలుగులో కార్తీకి మంచి ఫాలోయింగ్
  • ఆయన హీరోగా నటించిన సర్దార్ చిత్రం సూపర్‌‌ హిట్
  • రెండో పార్టులో విలన్‌గా నటించనున్న విజయ్ సేతుపతి
తమిళ అగ్ర నటుడు సూర్య తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన కార్తీ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. అటు తమిళంలో పాటు ఇటు తెలుగులోనూ తనకు భారీ ఫాలోయింగ్ ఉంది. అతని తొలి చిత్రం యుగానికి ఒక్కడు నుంచి మొన్నటి పొన్నియన్ సెల్వన్2 వరకు అన్ని సినిమాలూ టాలీవుడ్‌లో మంచి ఓపెనింగ్స్ రాబట్టాయి. తను హీరోగా నటించిన ‘ఖైదీ’, ‘సర్దార్‌‌’ సినిమాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ‘ఖైదీ’కి సీక్వెల్‌ ఉంటుందని ముందుగానే ప్రకటించారు. ఇప్పుడు సర్దార్ సినిమాకు కూడా సీక్వెల్ రాబోతోంది. 

పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి పార్టులో స్పై థ్రిల్లర్‌‌లో కార్తీ తండ్రి, కొడుకు పాత్రల్లో నటించి మెప్పించాడు. మిత్రన్ దర్శకత్వంలోనే ఈ సినిమా రెండో పార్టుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. మొదటి పార్టుకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా సీక్వెల్‌కు యువన్‌ శంకర్‌‌ రాజాను తీసుకున్నారు. ఇక, ఈ సినిమాలో విలన్‌గా విజయ్ సేతుపతి నటించనున్నారు. ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.  ‘ఖైదీ 2’ కంటే ముందే సర్దార్‌‌2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం కార్తీ హీరోగా నటిస్తున్న ‘జపాన్’ చిత్రం ఈ దీపావళికి విడుదల కానుంది.
karthi
Tollywood
sequel
sardar
movie
Vijay Sethupathi

More Telugu News