seema haider: సీమా హైదర్ మరో సంచలనం.. త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ!

seema haider to play raw agent in movie after film director takes audition
  • ‘పబ్‌జీ’ లవర్ కోసం పాక్ వచ్చిన సీమా హైదర్
  • ఇప్పుడు ఓ సినిమాలో చాన్స్ కొట్టేసినట్లు వార్తలు
  • ‘ఎ టైలర్ మర్డర్ స్టోరీ’ సినిమాలో రా ఏజెంట్ పాత్ర!
  • ఇప్పటికే ఆడిషన్స్ తీసుకున్న డైరెక్టర్లు
‘పబ్‌జీ’ గేమ్‌ ద్వారా పరిచయమైన యువకుడి కోసం పాకిస్థాన్ నుంచి మన దేశంలోకి వచ్చి పెద్ద సంచలనమే రేపింది సీమా హైదర్. ఇప్పుడు మరో సంచలనానికి సిద్ధమవుతోంది. ఓ సినిమాలో సీమా హైదర్ చాన్స్ కొట్టేసింది. అది కూడా సాదా సీదా పాత్ర కాదు.. ఏకంగా రా ఏజెంట్‌గా కనిపిస్తుందట.

గతేడాది రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌‌లో టైలర్ కన్నయ్య లాల్ సాహూ దారుణ హత్యకు గురయ్యాడు. కలకలం రేపిన ఈ ఘటన ఆధారంగా ఓ సినిమా రూపొందుతోంది. ‘ఎ టైలర్ మర్డర్ స్టోరీ’ పేరుతో తీస్తున్న ఈ చిత్రంలో ఓ పాత్ర కోసం సీమా హైదర్‌‌ను మేకర్స్ సంప్రదించారు. ఈ మేరకు దర్శకులు జయంత్ సిన్హా, భరత్ సింగ్‌లు ఆమెకు ఆడిషన్స్ నిర్వహించినట్లు కొన్ని జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఇందులో ‘రా’ ఆఫీసర్ పాత్రలో సీమా హైదర్ కనిపించనుందట.

పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్‌‌.. యూపీకి చెందిన సచిన్ మీనా కోసం సరిహద్దులు దాటి వచ్చింది. వీరిద్దరికీ పబ్‌జీలో మొదలైన పరిచయం ప్రేమగా మారింది. దీంతో వివాహితురాలైన సీమా.. తన నలుగురు పిల్లలతో కలిసి ఇండియాకు వచ్చేసింది. ప్రస్తుతం గ్రేటర్‌‌ నోయిడాలో ఉంటోంది. మరోవైపు సీమా.. పాకిస్థాన్ స్పై అనే ఆరోపణలూ ఉన్నాయి. ఆమె బంధువులు ఆర్మీలో ఉండటమే ఇందుకు కారణం. ఇప్పుడు సినిమాలో చాన్స్‌ కొట్టేసి.. ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో.
seema haider
PUBG Love
raw agent
Tailor Kanhaiya Lal
A Tailor Murder Story

More Telugu News