Mamata Banerjee: బీజేపీ ఈవీఎం హ్యాకింగ్ ప్రయత్నాలపై ఆధారాలున్నాయి: మమతా బెనర్జీ

India will save country from disaster Communal Tension Mamata

  • I.N.D.I.A. గెలిచాక దేశాన్ని కాపాడుతుందన్న బెంగాల్ సీఎం
  • మతపర ఉద్రిక్తత, నిరుద్యోగం నుండి ప్రతిపక్ష కూటమి కాపాడుతుందని వ్యాఖ్య
  • బీజేపీ హ్యాకింగ్‌పై మరిన్ని ఆధారాల సేకరణ కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడి

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రతిపక్ష కూటమి I.N.D.I.A. దేశాన్ని విపత్తు, మతపరమైన ఉద్రిక్తత,  నిరుద్యోగం నుండి కాపాడుతుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం అన్నారు. వచ్చే ఎన్నికల్లో I.N.D.I.A. కూటమి విజయం సాధించడం ఖాయమన్నారు. అయితే ఈ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఇప్పటికే ప్రణాళికలు మొదలు పెట్టిందని, ఈవీఎంలను హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తోందని తెలిసిందన్నారు. ఇందుకు సంబంధించి తమ వద్ద కొన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయని, మరికొన్ని ఆధారాల సేకరణ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

ఈ మేరకు మమత రాష్ట్ర సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... సార్వత్రిక ఎన్నికల్లో ఎలా గెలవాలనే దానిపై బీజేపీ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకుందన్నారు. ఈవీఎంలను హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారనే విషయం తెలిసిందన్నారు. దేశాన్ని కాపాడేది I.N.D.I.A. మాత్రమేనని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News