Bhuma Jagath Vikhyath Reddy: నంద్యాలలో పోటీ చేయడంపై భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి స్పందన

I will be the TDP Candidate in Nandyal says Bhuma Jagath Vikhyath Reddy
  • మర్యాదపూర్వకంగానే చంద్రబాబును మనోజ్, మౌనిక కలిశారన్న జగత్ విఖ్యాత్ రెడ్డి
  • నంద్యాల బరిలో తానే ఉంటానని స్పష్టీకరణ
  • తమ కుటుంబం మొత్తం ఒక్కటిగానే ఉందని వ్యాఖ్య
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరి మౌనికా రెడ్డిని సినీ నటుడు మంచు మనోజ్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబును మౌనిక, మనోజ్ దంపతులు కలిశారు. దీంతో, వచ్చే ఎన్నికల్లో వీరు ఎన్నికల బరిలోకి దిగబోతున్నారా? అనే సందేహాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. 

దీనిపై మౌనిక సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి స్పందించారు. కేవలం మర్యాదపూర్వకంగానే చంద్రబాబును మనోజ్, మౌనిక కలిశారని చెప్పారు. తమ కుటుంబం మొత్తం ఒక్కటిగానే ఉందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో నంద్యాల బరిలో తానే ఉంటానని స్పష్టం చేశారు. నంద్యాల టికెట్ కోసం టీడీపీలో పోటీ ఉందని చెప్పారు.
Bhuma Jagath Vikhyath Reddy
Bhuma Mounika
Manchu Manoj
Chandrababu
Telugudesam

More Telugu News