Narendra Modi: అది 'ఇండియా' కూటమి కాదు.. వారిని ఇలా పిలవండి: కొత్త పేరు చెప్పిన మోదీ
- విపక్ష కూటమిని గమాండియా అని పిలవాలన్న మోదీ
- ఈ పదానికి హిందీలో గర్వం లేదా అహంకారం అని అర్థం
- పాత రికార్డును తొలగించుకోవడానికే ఇండియా అని రీబ్రాండ్ చేసుకున్నారని విమర్శ
విపక్ష ఇండియా కూటమిపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. అది 'ఇండియా' కాదు.. 'గమాండియా' అని విమర్శించారు. హిందీలో గమాండియా అంటే గర్వం లేదా అహంకారం అని అర్థం. ఇండియా పేరుపై ఇటీవల మోదీ వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. వారి పాత రికార్డు నుంచి బయటపడేందుకు యూపీఏను ఇండియాగా రీబ్రాండ్ చేసుకున్నారని ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎద్దేవా చేశారు. దేశం మీద ఉన్న భక్తితో వారు ఇండియా అనే పేరు పెట్టుకోలేదని... దేశాన్ని దోచుకోవాలనే లక్ష్యంతో ఆ పేరు పెట్టుకున్నారని దుయ్యబట్టారు.
మరోవైపు ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ... ఎన్డీయే - ఇండియా మధ్య పోటీ అంటే... మోదీ - ఇండియాకు మధ్య జరిగే పోటీ అని చెప్పారు. ఇండియాకు వ్యతిరేకంగా ఎవరైనా నిలబడితే ఎవరు గెలుస్తారనే విషయం అందరికీ తెలుసని అన్నారు.