Thopudurthi Prakash Reddy: చంద్రబాబు సీఎం అయితే గుండు కొట్టించుకుంటా.. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సవాల్

ysrcp mla thopudurthi prakash reddy fires chandrababu
  • ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు 40 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్న ప్రకాశ్ రెడ్డి
  • రాయలసీమ గురించి మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదని మండిపాటు
  • మీ దోపిడీల గురించి మాట్లాడితే బెదిరింపులకు దిగుతారా? అని నిలదీత
సాగునీటి ప్రాజెక్టుల పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు రూ.40 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి ఆరోపించారు. రాయలసీమ గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని, ఆయనో గజదొంగ అని మండిపడ్డారు. చంద్రబాబు సీఎం అయితే గుండు కొట్టించుకుంటానని సవాల్ చేశారు.

శుక్రవారం మీడియాతో ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు ఏ రోజైనా ప్రజా సంక్షేమం కోసం ఆలోచించారా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టులను పూర్తి చేసే ఉద్దేశం ఆయనకు లేదని, శిలాఫలకాలు వేయడం తప్పితే ఏం చేశారని నిలదీశారు. మీ దోపిడీల గురించి మాట్లాడితే బెదిరింపులకు దిగుతారా? అని ధ్వజమెత్తారు. 

అమరావతిని రియల్ ఎస్టేట్ దందాగా చంద్రబాబు మార్చారని తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి విమర్శించారు. జగనన్న ఇళ్ల నిర్మాణంతో పేదల కల నెరవేరుతోందని అన్నారు. చంద్రబాబులా పేదలను దోచుకునే అలవాటు తమకు లేదని చెప్పారు. చంద్రబాబు తన బినామీలతో అమరావతిలో భూములు కొనిపించారని ఆరోపించారు. తనకు రూ.2 వేల కోట్లు ఉన్నాయని నిరూపిస్తే.. వాటిని రూ.20 కోట్లకే రాసిస్తానని అన్నారు. చంద్రబాబు ఇక జన్మలో సీఎం కాలేరని, ఒకవేళ అయితే గుండు కొట్టించుకుంటానని అన్నారు. 
Thopudurthi Prakash Reddy
Chandrababu
YSRCP
raptadu
Telugudesam
Jagan

More Telugu News