Tirumala: జులై నెలలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.129.08 కోట్లు
- గతంతో పోల్చితే పెరిగిన శ్రీనివాసుడి ఆదాయం
- జులై నెలలో స్వామివారిని దర్శించుకున్నవారి సంఖ్య 23 లక్షలు
- తలనీలాల విక్రయం ద్వారా రూ.104 కోట్ల ఆదాయం
కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత తిరుమల శ్రీవారి ఆదాయం గణనీయంగా పెరిగింది. గతంలో పోల్చితే స్వామివారికి హుండీ ద్వారా అధిక ఆదాయం లభిస్తోంది. జులై నెలలో తిరుమల శ్రీనివాసుడికి హుండీ ద్వారా రూ.129.08 కోట్ల ఆదాయం లభించింది. గత నెలలో వెంకన్నస్వామిని 23.23 లక్షల మంది దర్శించుకున్నారు. అదే సమయంలో 1.10 కోట్ల లడ్డూలను విక్రయించారు. ఈ మేరకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 56.68 లక్షల మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారని, జులై నెలకు సంబంధించి తలనీలాల విక్రయం ద్వారా రూ.104 కోట్లు వచ్చిందనీ వివరించారు.