Haryana: అల్లర్లు చెలరేగిన హర్యానాలోని నూహ్​ ప్రాంతంలో నేడు కూడా కొనసాగుతున్న ‘బుల్డోజర్ చర్య’

Days after riots bulldozer action in Haryana Nuh on chief minister orders

  • గత నెల 31న నూహ్ జిల్లాల్లో చెలరేగిన మత హింస
  • నూహ్ సమీపంలోని టౌరులో ఇళ్లు, గుడిసెలను కూల్చివేస్తున్న బుల్డోజర్లు
  • ఈ ప్రాంతంలో కొందరు అక్రమంగా నివాసం ఉంటున్నారని చెబుతున్న ప్రభుత్వం

హర్యానాలోని నూహ్ జిల్లాలో ఇటీవల జరిగిన మత హింసకు కారణమైన వారిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం 'బుల్డోజర్ చర్య' చేపట్టింది. అల్లర్లకు దెబ్బతిన్న నుహ్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని టౌరులో అనేక ఇళ్లను కూల్చివేసింది. ఇళ్లు, గుడిసెల్లో అక్రమ వలసదారులు చట్టవిరుద్ధంగా ఉంటున్నారని, గత నెల 31న జరిగిన అల్లర్లలో వాళ్లే పాల్గొన్నారని అధికారులు ధ్రువీకరించారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆదేశాల మేరకు ఈ కూల్చివేత కార్యక్రమం చేపట్టినట్లు నుహ్ ఎస్డీఎం అశ్విని కుమార్ తెలిపారు. ‘ఇది సీఎం ఆదేశాల మేరకే.. ఇదంతా అక్రమ కట్టడాలు. ఇక్కడ ఉన్న వాళ్లే ఈ అల్లర్లకు పాల్పడ్డారు’ అని కుమార్ తెలిపారు. శుక్రవారం కూడా ఈ ప్రాంతంలో అక్రమ వలసదారుల ఆక్రమణలను ధ్వంసం చేశారు. 

ఈ రోజు తెల్లవారుజామున నుహ్ లోని ఎస్కేఎం ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలోని నిర్మాణాలు, గుడిసెలను కూల్చివేశారు. హర్యానా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఈ కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయితే, బుల్డోజర్ ఆపరేషన్‌కు సంబంధించి నుహ్ జిల్లా అధికార యంత్రాంగం ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. సంఘటనా స్థలంలో ఉన్న అధికారులు మాత్రం వలసదారులు ఇక్కడ ఆక్రమించిన నిర్మాణాల కూల్చివేతలకు, ఈ ప్రాంతంలో ఇటీవల జరిగిన మత ఉద్రిక్తతలకు సంబంధం లేదంటున్నారు.

  • Loading...

More Telugu News