Ayushman bharatmhealth account: ఆయుష్మాన్ ఖాతాల్లో ఏపీకి నంబర్ 1 స్థానం

Andhra has the most Ayushman accounts

  • దేశవ్యాప్తంగా మొత్తం 44 కోట్ల ఖాతాలు
  • అందులో 4.13 కోట్లు ఏపీ నుంచే
  • డిజిటల్ రూపంలో హెల్త్ రికార్డులు

ఆయుష్మాన్ భారత్ ఖాతాల్లో (ఏబీహెచ్ఏ) ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 44 కోట్ల ఖాతాలు ఇప్పటి వరకు ప్రారంభం కాగా, అందులో 4.13 కోట్ల ఖాతాలు ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నాయి. రాష్ట్ర జనాభా సంఖ్యా పరంగా చూస్తే 85 శాతం మందికి ఆయుష్మాన్ భారత్ ఖాతాలు అందించినట్టు తెలుస్తోంది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అనేది వ్యక్తిగత డిజిటల్ హెల్త్ అకౌంట్. ఒక వ్యక్తి తన ఆరోగ్యం, చికిత్సలకు సంబంధించిన సమాచారాన్ని ఇందులో నిల్వ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ రూపంలో హెల్త్ రికార్డులు భద్రపరచాలన్న లక్ష్యం ఈ కార్యక్రమం వెనుకనున్న ఉద్దేశ్యం. 

రాష్ట్ర ప్రజలకు 14 అంకెల ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ను అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన కృషిని కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించినట్టు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణ బాబు ప్రకటించారు. క్షేత్రస్థాయి ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల సాయంతో ఆంధ్రప్రదేశ్ సర్కారు ఎక్కువ మంది ప్రజలకు ఈ డిజిటల్ హెల్త్ అకౌంట్ ను అందించడం గమనార్హం.

  • Loading...

More Telugu News