Rajinikanth: సూపర్‌స్టారా మజాకా.. సినిమా బడ్జెట్ 225 కోట్లు.. రజనీకాంత్ పారితోషికం 110 కోట్లు!
- ఈ నెల 10న విడుదల కానున్న చిత్రం
- నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం
- హీరోయిన్గా నటించిన తమన్నా
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 10న విడుదలవనుంది. రజనీకాంత్ సరన తమన్నా హీరోయిన్ గా నటించగా.. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 225 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. సినిమా పోస్టర్లు, పాటలు, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రీ బిజినెస్ కూడా ఆ స్థాయిలోనే జరిగింది.
ఈ సినిమాలో నటీనటుల పారితోషికం విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో నటించినందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ ఏకంగా 110 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంటే సినిమా బడ్జెట్లో దాదాపు సగం ఆయన పారితోషికమే అవుతోంది. గతంలోనూ ఓ సినిమాను రజనీ ఇంతే మొత్తం తీసుకున్నారట. మోహన్ లాల్ కు 8 కోట్లు, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ కు చెరో నాలుగు కోట్లు, తమన్నాకు మూడు కోట్లు, యోగి బాబుకు కోటి, రమ్యకృష్ణకు 80 లక్షలు ముట్టచెప్పినట్టు తెలుస్తోంది.