Peddireddi Ramachandra Reddy: విద్యార్థి దశ నుంచే నాతో చంద్రబాబుకు గొడవ ఉంది: మంత్రి పెద్దిరెడ్డి

Chandrababu has dispute with me since student stage says Peddireddi Ramachandra Reddy
  • పుంగనూరు ఘటనకు చంద్రబాబే కారణమన్న పెద్దిరెడ్డి
  • నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శ
  • పోలీసులపై దాడి చేసి.. రివర్స్ లో మాట్లాడుతున్నారని వ్యాఖ్య
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పుంగనూరులో నిన్న చోటు చేసుకున్న హింస రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పలువురు టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

విద్యార్థి దశ నుంచే తనతో చంద్రబాబుకు గొడవ ఉందని ఆయన చెప్పారు. అందుకే పుంగనూరులో టీడీపీ నేతలను, కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొట్టారని అన్నారు. పుంగనూరు ఘటనకు చంద్రబాబే కారణమని చెప్పారు. మతిభ్రమించి ఆయన నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. 

బైపాస్ రోడ్ లో వెళ్తానని రోడ్ మ్యాప్ ఇచ్చి పుంగనూరు పట్టణంలోకి వచ్చారని దుయ్యబట్టారు. తన కాన్వాయ్ లో రౌడీమూకలను, కర్రలను, రాళ్లను తెచ్చారని చెప్పారు. పోలీసులపై దాడి చేసిందేకాక, రివర్స్ లో మాట్లాడుతున్నారని అన్నారు. ఓటమి భయంతో హింసా రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
Peddireddi Ramachandra Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News