Tomato: టమాటా.. వీరి జీవితాలనే మార్చేసింది..

Tomatoes give farmers seat in Crorepati Club

  • రూ.లక్షల నుంచి రూ.కోట్ల ఆదాయం
  • సాధారణ రోజులతో పోలిస్తే 20 రెట్లు అధిక ధర
  • టమాటా రైతుల జీవితాల్లో 2023 చిరస్మరణీయం

సాగుతో కోట్లు కూటబెట్టడం అన్నది అధిక శాతం మంది రైతుల జీవితాల్లో సాధ్యం కాదు. కానీ, ఇప్పుడు పేద రైతుల పాలిట టమాటా పంట కాసులు కురిపిస్తోంది. ‘నా కోసం ఇంత కష్టపడుతున్న రైతుల రుణం ఉంచుకోకూడదు’అన్న రీతిలో కిలో టమాటా రూ.200 దాటిపోవడం తెలిసిందే. సాధారణంగా టమాటా పండించే రైతుకు ఒక కిలోకి వచ్చేది రూ.10లోపే. అనుకోకుండా 20 రెట్లు అధిక ధర పలకడం రైతుల జీవితాలనే మార్చేసింది.

రంగారెడ్డి జిల్లా పులుమామిడి గ్రామానికి చెందిన రైతు కే అనంతరెడ్డి ఒక ఎకరా టమాటా పంటపై రూ.20 లక్షల ఆదాయం సంపాదించారు. దీంతో ఆయన ఒక కొత్త ట్రాక్టర్, హ్యుందాయ్ వెన్యూ కారు కొనుగోలు చేశారు. అలాగే కర్ణాటక రాష్ట్రంలోని జలబిగనపల్లి గ్రామానికి చెందిన 35 ఏళ్ల అరవింద్ అనే రైతు ఐదు ఎకరాల్లో టమాటా సాగు చేసి ఈ ఏడాది రూ.1.4 కోట్లు సంపాదించారు. తన తల్లి కోసం ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. ఆంధ్రప్రదేశ్ లోని కరకమండ గ్రామానికి చెందిన రైతు సోదరులు పాసలప్పగారి చంద్రమౌళి, మురళి టమాటా పంటతో రూ.3 కోట్లు ఆర్జించారు. 

మామూలు రోజుల్లో టమాటా పంట ద్వారా రైతులకు వచ్చే ఆదాయం నామమాత్రంగానే ఉంటుంది. 20 కిలోల టమాటా సాధారణంగా డిమాండ్ ఎక్కువ ఉండే రోజుల్లో రూ.300 వరకు పలుకుతుంది. డిమాండ్ కంటే ఎక్కువ పంట మార్కెట్లోకి వచ్చినప్పుడు 20 కిలోల బాక్స్ ధర రూ.40-50 మించదు. అంటే కిలో రూ.2 కూడా గిట్టుబాటు కాదు. అలాంటిది ఇప్పుడు రూ.200కు పైనే పలుకుతోంది. రూపాయి, రెండు రూపాయలకు కిలో టమాటా అమ్ముకోవడం ఇష్టం లేక కాలువల్లో కుమ్మరించిన రైతులు కూడా ఉన్నారు. టమాటానే నమ్ముకున్న రైతుకి ఇంతకాలానికి మంచి టైమ్ వచ్చినట్టుంది. అందుకే టమాటా రైతుల జీవితాల్లో 2023 చిరస్మరణీయంగా ఉండిపోతుంది.

  • Loading...

More Telugu News