Gaddar: అంతిమయాత్ర ప్రారంభం.. గద్దర్ నివాసంలో నివాళి అర్పించనున్న కేసీఆర్

Gaddar final journey started
  • ఎల్బీ స్టేడియం నుంచి ప్రారంభమైన గద్దర్ అంతిమయాత్ర
  • గద్దర్ నివాసంలో కాసేపు ఉండనున్న పార్థివదేహం
  • బోధి విద్యాలయంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ అంతిమయాత్ర ప్రారంభమయింది. ఎల్బీ స్టేడియం నుంచి చివరి యాత్ర కొనసాగుతోంది. వేలాది మంది అభిమానులు పార్థివదేహాన్ని అనుసరిస్తుండగా ఆయన అంతిమయాత్ర సాగుతోంది. జోహార్ గద్దర్ అంటూ అభిమానులు, సన్నిహితులు, అనుచరులు నినదిస్తున్నారు. గన్ పార్క్, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్తూపం, ట్యాంక్ బండ్ మీదుగా ఆల్వాల్ లోని ఆయన నివాసం వరకు అంతిమయాత్ర కొనసాగుతుంది. తన నివాసంలో గద్దర్ పార్థివ దేహాన్ని కాసేపు ఉంచుతారు. ఇక్కడే గద్దర్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి అర్పిస్తారు. అనంతరం తాను ఏర్పాటు చేసిన బోధి విద్యాలయంలో గద్దర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతాయి.
Gaddar
Final Journey
KCR
BRS

More Telugu News