Nandigam Suresh: చిరంజీవి గారూ.. మొదలు పెట్టిందే మీ తమ్ముడు: నందిగం సురేశ్

Nandigam Suresh response to Chiranjeevi comments
  • ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి తీవ్ర వ్యాఖ్యలు
  • బురద రాజకీయాలు చేయవద్దని మీ తమ్ముడికి చెప్పాలన్న సురేశ్
  • ప్రత్యేక హోదా ఎలా తీసుకురావాలో మేం చూసుకుంటామని వ్యాఖ్య
ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన విమర్శలు దుమారం రేపుతున్నాయి. రాష్ట్ర అభివృద్ధిని చూసుకోవాలని, సినీ పరిశ్రమ గురించి ఎందుకని చిరంజీవి విమర్శించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా చిరంజీవికి కౌంటర్ ఇస్తున్నారు. వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ స్పందిస్తూ... 'చిరంజీవి గారు తొలుత మొదలు పెట్టిందే మీ తమ్ముడు' అని ట్వీట్ చేశారు. బురద రాజకీయాలు చేయవద్దని మీ తమ్ముడికి చెప్పాలని అన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని పవన్ కు చెప్పాలని... రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఎలా తీసుకురావాలో మేం చూసుకుంటామని చెప్పారు.
Nandigam Suresh
YSRCP
Chiranjeevi
Tollywood
Pawan Kalyan
Janasena

More Telugu News