Nagachaitanya: మత్స్యకారుల నేపథ్యంలో మరో సినిమా!
- చైతూ హీరోగా చందూ మొండేటి సినిమా
- నిర్మాతగా వ్యవహరించనున్న బన్నీ వాసు
- చివరిదశకి చేరుకున్న ప్రీ ప్రొడక్షన్ పనులు
- జాలరుల నేపథ్యంలో సాగే కథాకథనాలు
ఈ మధ్య కాలంలో సముద్రం .. మత్స్యకారుల జీవితం నేపథ్యంలోని కథలు తెరపైకి ఎక్కువగా వస్తున్నాయి. చిరంజీవి కథానాయకుడిగా చేసిన 'వాల్తేరు వీరయ్య' సినిమా జాలరుల జీవితాలను ఆవిష్కరించినదే. ఇటీవల మలయాళం నుంచి వచ్చిన '2018'లో కూడా జాలరుల జీవన నేపథ్యం ప్రధానమైన అంశంగా కనిపిస్తుంది.
ఇక రీసెంటుగా ఓటీటీకి వచ్చిన 'రుద్రమాంబపురం' కూడా జాలరుల నేపథ్యంలో వచ్చిన సినిమానే. బెంగాలీ సినిమాగా ఇటీవల ఓటీటీ ద్వారా పలకరించిన 'హవా' కూడా జాలరులు చేపల వేటను ఎలా చేస్తారు? అనే అంశంపై నడుస్తుంది. ఇలా జాలరుల నేపథ్యంలోనే మరో తెలుగు సినిమా పట్టాలెక్కడానికి రెడీ అవుతోంది.
నాగచైతన్య హీరోగా చేసే ఈ సినిమాను బన్నీ వాసు నిర్మించనుండగా, చందూ మొండేటి దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక జాలరుల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనేది తెలుసుకుంటూ .. వాళ్లను దగ్గరగా పరిశీలించే పనిలో చైతూ ఉన్నాడు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.