Rahul Gandhi: రాహుల్ గాంధీకి మళ్లీ అధికారిక నివాసం కేటాయింపు
- గతంలో మోదీ అనే ఇంటిపేరుపై రాహుల్ వ్యాఖ్యలు
- జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు
- పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు
- ఇటీవల సూరత్ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే
- మళ్లీ పార్లమెంటులో అడుగుపెట్టిన రాహుల్
ఈ దొంగలందరికీ మోదీ అనే ఇంటి పేరే ఉంటోంది అంటూ వ్యాఖ్యలు చేసిన ఫలితంగా సూరత్ కోర్టు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు పడింది.
ఇటీవల సూరత్ కోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో రాహుల్ గాంధీ మళ్లీ పార్లమెంటులో అడుగుపెట్టారు. ఆయన పార్లమెంటు సభ్యత్వం పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో, రాహుల్ కు మళ్లీ అధికారిక నివాసం కేటాయించారు.
గతంలో పార్లమెంటు అనర్హత వేటు వేయడంతో, ఆయన ఢిల్లీలోని నెంబర్ 12, తుగ్లక్ లేన్ లోని తన అధికారిక బంగ్లాను ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడాయన పార్లమెంటు సభ్యత్వం తిరిగి పొందడంతో, కోల్పోయిన అధికారిక సౌకర్యాలన్నీ ఒక్కొక్కటిగా సమకూరుతున్నాయి.
కాగా, అధికారిక నివాసం కేటాయింపుపై రాహుల్ ను మీడియా పలకరించగా, ఆయన ఆసక్తికరంగా స్పందించారు. యావత్ భారతదేశం నా ఇల్లు అని పేర్కొన్నారు.