Rahul Gandhi: రాహుల్ గాంధీ శిక్షను సమర్థించిన గుజరాత్ హైకోర్టు జడ్జి బదిలీ
- వివిధ రాష్ట్రాలకు చెందిన 9 మంది జడ్జిలను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు
- రాహుల్ కేసును విచారించిన జస్టిస్ హేమంత్ బదిలీ
- రాహుల్ కు కింది కోర్టు విధించిన శిక్షపై స్టే విధించిన సుప్రీంకోర్టు
మోదీ ఇంటి పేరుపై పరువునష్టం దావా కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించిన గుజరాత్ హైకోర్టు జడ్జి బదిలీ అయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఆయనతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 9 మంది న్యాయమూర్తులను బదిలీ చేయాయని కొలీజియం సిఫార్సు చేసింది.
ఆమధ్య సూరత్ కోర్టు విధించిన శిక్షపై రాహుల్ గుజారాత్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ హేమంత్ రాహుల్ పిటిషన్ ను తిరస్కరించారు. కింది కోర్టు తీర్పును సమర్థించారు. అయితే, రాహుల్ ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో రాహుల్ కు ఊరట లభించింది. ఆయనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీం స్టే విధించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మళ్లీ పార్లమెంటులో అడుగు పెట్టారు. ఎంపీగా ఆయనకిచ్చిన అధికారిక బంగ్లాను కూడా మళ్లీ ఆయనకు కేటాయించారు.