Bengaluru: రాయల్ ఎన్‌ఫీల్డ్ బండిపై ర్యాపిడో డ్రైవర్ రాక.. కస్టమర్‌కు షాక్!

Bengaluru Mans Rapido Rider Arrives On A Royal Enfield And He Was A devOps engenieer

  • బెంగళూరులో టెకీకి ఊహించని అనుభవం
  • ర్యాపిడోలో బైక్ బుక్ చేస్తే రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై ర్యాపిడో కెప్టెన్ రాక
  • తానో డెవ్‌ఆప్స్ ఇంజినీర్ అని ర్యాపిడో కెప్టెన్ చెప్పడంతో మరింత ఆశ్చర్యపొయిన కస్టమర్
  • బైక్ రైడింగ్ తనకు ఇష్టమని, అందుకే ఇలా చేస్తున్నానని ర్యాపిడో కెప్టెన్ వెల్లడి

ర్యాపిడో బైక్ బుక్ చేస్తే ఏ స్ప్లెండర్, ప్యాషన్, యాక్టివా... మహా అయితే పల్సర్ బైక్ వస్తుందని అనుకుంటాం. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నిషిత్ పటేల్ కూడా ఇలాగే అనుకుని బైక్ బుక్ చేశాడు. కానీ, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ బైక్ నడుపుకుంటూ ర్యాపిడో బైక్ కెప్టెన్ రావడం చూసి ఆశ్చర్యపోయాడా టెకీ. బతుకుదెరువు కోసం ర్యాపిడో నడుపుకునే వ్యక్తికి ఇంతటి ఖరీదైన బైక్ ఉండడమేంటో అతడికి అర్థంకాలేదు. తన సందేహాన్ని డ్రైవర్‌తో ప్రస్తావిస్తే అతడి సమాధానం మరింత ఆశ్చర్యానికి గురించి చేసింది. ఎన్‌ఫీల్డ్‌పై వచ్చిన ఆ డ్రైవర్ కూడా డెవ్ఆప్స్ ఇంజినీర్ అని, ప్రస్తుతం ఓ బడా సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడని తెలిసి నివ్వెరపోయాడు. తనకు బైక్ రైడింగ్ అంటే ఇష్టమని చెప్పిన అతడు, ఖాళీ సమయాల్లో ఇలా చేస్తుంటానని అన్నాడు. 

ఇదంతా నెట్టింట్లో షేర్ చేసిన నిషిత్ పటేల్..బెంగళూరులో ఇలాంటి ఘటనలే జరుగుతుంటాయని ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. అతడు ఓలాలో ఎంత సంపాదిస్తున్నాడో అడిగితే బాగుండేదని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ఇదేమంత పెద్ద విషయం కాదని అహ్మదాబాద్‌కు చెందిన మరో వ్యక్తి వ్యాఖ్యానించాడు. ‘‘అయితే ఏంటి? గత అయిదు సంవత్సరాలుగా అహ్మదాబాద్‌లో ఓలా, ఊబెర్, ర్యాపిడో డ్రైవర్లు రాయల్ ఎన్‌ఫీల్డ్‌తో పాటూ హర్లీడేవిడ్‌సన్ వంటి బైకులు నడుపుతున్నారు’’ అని వివరించాడు.

  • Loading...

More Telugu News