Sathyaraj: ‘కట్టప్ప’ సత్యరాజ్ ఇంట్లో విషాదం

Sathyarajs mother passes away Kamal Haasan Uday Stalin and other celebs express their condolences
  • సత్యరాజ్ తల్లి నాదాంబాళ్ మృతి
  • వృద్ధాప్య కారణాలతో నిన్న తుదిశ్వాస
  • హైదరాబాద్‌లో షూటింగ్‌ నుంచి వెళ్లిపోయిన సత్యరాజ్
‘కట్టప్ప’ సత్యరాజ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి నాదాంబాళ్ కాళింగరాయర్ (94) కన్నుమూశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఉంటున్న నాదాంబాళ్.. వృద్ధాప్య కారణాలతో శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లో షూటింగ్‌లో ఉన్న నటుడు సత్యరాజ్‌.. ఈ విషయం తెలియగానే వెంటనే కోయంబత్తూరుకు బయల్దేరి వెళ్లారు. ఈ రోజు అంత్యక్రియలు జరగనున్నాయి.

నాదాంబాళ్ కాళింగరాయర్‌‌కు కొడుకు సత్యరాజ్‌తోపాటు కూతుళ్లు కల్పన, రూప ఉన్నారు. ఆమె మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. నటులు కమల్ హాసన్, ఉదయనిధి స్టాలిన్, డైరెక్టర్ శీను రామస్వామి తదితరులు సంతాపం తెలిపారు.
Sathyaraj
mother passes away
Kattappa
Coimbatore
Kamal Haasan
Uday Stalin

More Telugu News