heart attack: నలభై ఏళ్లలోపు వారికి గుండెపోటు.. కారణాలు ఇవేనట..!

whats behind the rise in heart attacks among young people

  • యువతలో పెరుగుతున్న గుండెపోటు బాధితుల సంఖ్య
  • జీవనశైలిలో మార్పులే ప్రధాన కారణమంటున్న నిపుణులు
  • మద్యపానం, ధూమపానంతో హృద్రోగ సమస్యలు తప్పవని హెచ్చరిక

గుండెపోటు.. గతంలో వయసు పైబడిన వారిలో కనిపించే అనారోగ్య సమస్య. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన వారిలో వృద్ధులే ఎక్కువగా ఉండేవారు. ఇటీవలి కాలంలో మాత్రం యువత కూడా గుండెపోటుతో కుప్పకూలుతున్నారు. పనిచేస్తూనో, వ్యాయామం చేస్తూనో సడెన్ గా ప్రాణాలు వదులుతున్నారు. ముఖ్యంగా నలభై ఏళ్లలోపు వారిలో గుండెపోటు రావడానికి జీవనశైలిలో మార్పులే కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆహారపుటలవాట్లు, మద్యపానం, ధూమపానం, నిత్యజీవితంలో ఒత్తిడి వల్ల గుండెపై భారం పెరిగిపోతోందని అంటున్నారు.

40 ఏళ్లలోపు వయస్కులలో గుండెపోటుకు కారణాలు..
  • వైట్ కాలర్ ఉద్యోగాల వల్ల రోజులో ఎక్కువ భాగం కూర్చుని పనిచేయడంతోనే సరిపోతోంది. నడక తగ్గి, శారీరక శ్రమ దాదాపు పూర్తిగా లేకుండా పోతోంది. మారిన జీవనశైలితో వచ్చిన ప్రధాన మార్పులివి. వీటివల్ల యువతలో హృద్రోగ సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
  • ఆహారపుటలవాట్ల వల్ల మధుమేహ బాధితుల సంఖ్య ఇటీవలి కాలంలో పెరిగింది. ఇది కూడా గుండె జబ్బులకు ఓ కారణమని వైద్యులు అంటున్నారు. మిగతా వారితో పోలిస్తే మధుమేహ బాధితులు గుండె జబ్బులతో చనిపోయే ముప్పు 2 నుంచి 4 రెట్లు ఎక్కువని చెప్పారు.
  • హృద్రోగ వ్యాధులకు కారణమయ్యే వాటిలో అధిక రక్తపోటు లేదా హైబీపీ ముఖ్య కారణం. అధిక రక్తపోటు వల్ల కండరాలు మందంగా మారి రక్తనాళాలను దెబ్బతీస్తాయి. ఫలితంగా రక్తప్రసరణలో మార్పులు చోటుచేసుకుని గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది.
  • అధిక బరువు అనారోగ్యకరమని, హృద్రోగంతో పాటు పలు ఇతర అనారోగ్యాలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
  • ధూమపానం అలవాటు గుండెపోటుకు దారితీస్తుందని, రోజూ కాల్చే సిగరెట్లు గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటు లేవి వారితో పోలిస్తే పొగరాయుళ్లకు గుండెపోటు ముప్పు 34 శాతం ఎక్కువని చెప్పారు. మద్యపానం కూడా గుండెపోటుకు కారణమవుతోందని వివరించారు.

  • Loading...

More Telugu News