Shahrukh Khan: నయనతారకు పడిపోయారా? అని ప్రశ్నించిన వ్యక్తిపై షారుక్ ఖాన్ ఆగ్రహం

Shahrukh Khan fires on a netizen who asked question about Nayanatara
  • షారుక్ ఖాన్, నయనతార కాంబినేషన్లో 'జవాన్'
  • సెప్టెంబర్ 7న విడుదలవుతున్న చిత్రం
  • అభిమానులతో చిట్ చాట్ నిర్వహించిన షారుక్
షారుక్ ఖాన్, నయనతార కాంబినేషన్లో తెరకెక్కిన 'జవాన్' సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని సౌతిండియా డైరెక్టర్ అట్లీకుమార్ తెరకెక్కించారు. దీంతో, నార్త్ తో పాటు దక్షిణాదిలో కూడా ఈ చిత్రంపై క్రేజ్ నెలకొంది. సెప్టెంబర్ 7న ఈ చిత్రం విడుదలవుతోంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఊపందుకుంటున్నాయి. 

మరోవైపు తాజాగా తన అభిమానులతో షారుక్ చాట్ సెషన్ నిర్వహించారు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. 'జవాన్' చిత్రం సందేశాత్మక చిత్రమని, మహిళల సాధికారత గురించి వివరించే సినిమా అని షారుక్ చెప్పారు. మహిళలను ఎలా గౌరవించాలనే విషయాన్ని ఈ చిత్రంలో చూపించామని తెలిపారు. ఈ చిత్రంలో మీ రొమాంటిక్ యాంగిల్ చూడొచ్చా? అని ఒక నెటిజన్ ప్రశ్నించగా... అన్ని యాంగిల్స్ లో చూడొచ్చని చెప్పారు. మీరు నయనతారకు ఫ్లాట్ అయ్యారా? ఆమెను ప్రేమిస్తున్నారా? అని ప్రశ్నించిన నెటిజెన్ పై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి అని, ఇలాంటి ప్రశ్నలు అడగొద్దని అన్నారు.
Shahrukh Khan
Nayanthara
Jawan Movie
Bollywood
Tollywood
Kollywood

More Telugu News