Telangana: మూడు రోజుల పాటు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు

Moderate rains expected in Telangana over the next three days says weather forecast

  • ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అవర్తనం
  • ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుండటంతో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు
  • శనివారం రాష్ట్రంలో పలుచోట్ల చెదురుమొదురు జల్లులు పడినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి

తెలంగాణలో వచ్చే మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా పలు చోట్ల వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోందని వెల్లడించింది. 

శనివారం నల్గొండ జిల్లా ఘన్‌పూర్‌లో 71 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. యాదాద్రి జిల్లా నందనంలో 53 మిల్లీమీటర్లు, ఖమ్మం జిల్లా లింగాలలో 43, రావినూతల, తిమ్మారావుపేటలలో 42, రంగారెడ్డి జిల్లా బోడకొండలో 39 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.

  • Loading...

More Telugu News