Reliance: జియో నుంచి చౌక 5జి ఫోన్.. త్వరలో విడుదల..!

Jio phone 5g might launch at reliance agm 2023 new jio phones spot on bis certification

  • 5జి ఫోన్ విడుదలకు జియో సన్నాహకాలు
  • ఇప్పటికే బీఐఎస్ సర్టిఫికెట్ వచ్చిందంటూ ప్రచారం
  • మార్కెట్లోకి రెండు కొత్త హ్యాండ్ సెట్ లు విడుదల చేయనున్న కంపెనీ

టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో కంపెనీ మరో సంచలనానికి తెరతీయనుంది. త్వరలో 5జి స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేయనుందని సమాచారం. ఈ స్మార్ట్ ఫోన్ ను చౌక ధరకే వినియోగదారులకు అందించేందుకు కంపెనీ ఏర్పాట్లు చేస్తోందని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీఐఎస్ సర్టిఫికేషన్ లభించిందని ప్రచారం జరుగుతోంది. 
రెండు కొత్త హ్యాండ్ సెట్ లకు సంబంధించి కంపెనీ ఉన్నత వర్గాల్లో ఇప్పటికే చర్చలు జరిగాయని, ఈ నెలాఖరులో జరగనున్న కంపెనీ వార్షిక సమావేశానికి ముందే ఈ స్మార్ట్ ఫోన్లకు సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. 

5జి స్మార్ట్ ఫోన్లకు సంబంధించి జియో కంపెనీ రెండు రకాల హ్యాండ్ సెట్లను తయారు చేసింది. ఈ ఫోన్ ల మోడల్ నంబర్ లు జేబీవీ161డబ్ల్యూ1, జేబీవీ162డబ్ల్యూ1.. అయితే, ఇవి రెండూ 5జీ ఫోన్లేనా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. రిలయన్స్ జియో 5జి ఫోన్లు అంటూ సోషల్ మీడియాలో ఇప్పటికే పలు చిత్రాలు ప్రచారంలో ఉన్నాయి. 

జియో 5జి ఫోన్ స్పెసిఫికేషన్‌లు..
90హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల హెచ్ డీ ప్లస్ స్క్రీన్‌
స్నాప్ డ్రాగన్ 480 చిప్‌ సెట్ స్పీడ్
18 వాట్స్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
13 మెగాపిక్సెల్ ప్రైమరీ, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా 
8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుందని తెలుస్తోంది

  • Loading...

More Telugu News