Betting bulls: ఈ గిత్తల జోడీ ధర రూ.కోటి మాత్రమే.. ఎందుకంత స్పెషల్ అంటే..!

Betting bulls sold for one crore rupees video goes viral

  • పందెం గిత్తలకు రికార్డు ధర
  • సొంతం చేసుకున్న బాపట్ల జిల్లా రైతు
  • తెలుగు రాష్ట్రాల్లో జరిగిన 40 పోటీల్లో 34 సార్ల ఫ్రైజ్ వీటికే

వ్యవసాయంలో యంత్రాల వాడకం పెరిగాక ఎద్దుల వాడకం దాదాపు పూర్తిగా తగ్గిపోయింది. గతంలో రైతుల ఇళ్లు, వాకిళ్లలో కనిపించే ఎద్దులు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. ఎద్దులు, ఎద్దుల బండ్లు ఎక్కడో తప్ప కనిపించడం లేదు. ఎద్దుల పందాల కోసం కొంతమంది రైతులు గిత్తలను ప్రేమగా పెంచుకుంటున్నారు. ఇలాంటి గిత్తలకు రైతులు లక్షల్లో వెచ్చిస్తుంటారు. తాజాగా ఓ రైతు జోడెద్దులను రికార్డు ధరకు సొంతం చేసుకున్నారు. రెండు గిత్తల కోసం ఇంత భారీ మొత్తం చెల్లించడం అరుదని రైతులు అంటున్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన సుంకి సురేందర్‌ రెడ్డి పందెం గిత్తలను పెంచుతుంటారు. భీముడు, అర్జునుడని ప్రేమగా పెంచుకుంటున్న రెండు గిత్తలను ఇటీవల అమ్మకానికి పెట్టగా రికార్డు ధర పలికింది. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా కొల్లూరు మండలం అనంతారం గ్రామానికి చెందిన రైతు ఈ గిత్తలకు అక్షరాలా కోటి రూపాయలు చెల్లించి సొంతం చేసుకున్నారు. ఇంత ఖరీదు పలకడానికి ఆ ఎద్దుల ప్రత్యేకత ఏంటంటే.. తెలుగు రాష్ట్రాల్లో గడిచిన 9 నెలల్లో 40 ఎద్దుల పోటీలు జరగగా అందులో 34 సార్లు ప్రథమ బహుమతి ఈ గిత్తలే గెలిచాయి. అందుకే ఇంత ధర పలికాయని సురేందర్ రెడ్డి చెప్పారు.


  • Loading...

More Telugu News