Raghu Rama Krishna Raju: ప్రతివాడూ... "పవన్ కల్యాణ్, దమ్ముంటే నా మీద పోటీ చేయ్" అనేవాడే!: రఘురామ
- నిన్న గాజువాకలో ఎంపీ ఎంవీవీపై పవన్ ఫైర్
- తనపై పోటీ చేయాలంటూ పవన్ కు సవాల్ విసిరిన ఎంవీవీ
- ఇలాంటి వాళ్లకు టికెట్లు వస్తాయన్న గ్యారెంటీ లేనట్టుందన్న రఘురామ
- అందుకే పవన్ కు సవాళ్లు విసురుతున్నారని ఎద్దేవా
జనసేనాని పవన్ కల్యాణ్ తన ప్రసంగాల్లో వైసీపీ నేతలపై ధ్వజమెత్తడం, వైసీపీ నేతలు పవన్ కల్యాణ్ పై విరుచుకుపడడం, ఆపై పవన్ కల్యాణ్ కు రఘురామకృష్ణరాజు మద్దతు పలకడం... ఇటీవలి కాలంలో పరిపాటిగా మారింది. నిన్న గాజువాకలో పవన్ చేసిన వ్యాఖ్యలతో ఏపీ మంత్రులు ఆయనపై ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి పవన్ కల్యాణ్ కు మద్దతుగా నిలిచారు.
ఈ మధ్య కాలంలో ప్రతివాడూ పవన్ ను సవాల్ చేస్తున్నాడని రఘురామ తెలిపారు. "పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేముంది? విశాఖలో ఒక ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేశారంటే ప్రభుత్వానికి తెలియకుండా ఇది జరిగే అవకాశం ఉందా? అని నాలాగానే పాజిటివ్ గా మాట్లాడారు. అయితే, తిరిగి ఎంపీ గారే తిట్టారో, లేక జగన్ గారు తిట్టించారో గానీ... సాక్షి పత్రికలో ఈ ఎంపీ వ్యాఖ్యలే వచ్చాయి. దమ్ముంటే తన మీద పోటీ చేయమని అంటున్నాడు.
ప్రతివాడూ... పవన్ కల్యాణ్, దమ్ముంటే నా మీద పోటీ చేయ్ అనేవాడే. ఆ మధ్య రాజమండ్రిలో ఎవడో అడిగాడు... దమ్ముంటే నా మీద పోటీ చేయ్ అని. దీనర్థం ఏంటంటే... వీళ్లెవరికీ మళ్లీ టికెట్లు వస్తాయన్న నమ్మకం లేదు. జోగి రమేశ్ నన్ను తిడితే మంత్రి పదవి ఇచ్చినట్టు... పవన్ కల్యాణ్ పై సవాల్ విసిరితేనన్నా టికెట్ ఇస్తారని వీళ్లు భావిస్తున్నట్టుంది" అంటూ రఘురామ వైసీపీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు.