India: కేంద్రంలో రాజకీయ స్థానం అవసరం లేదన్న మమతా బెనర్జీ
- రానున్న లోక్ సభ ఎన్నికల్లో I.N.D.I.A. కూటమిదే విజయమన్న మమత
- నరేంద్ర మోదీ ఈసారి చేసే ప్రసంగమే ఆయనకు చివరిదని వ్యాఖ్య
- మోదీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందన్న ఖర్గే
కేంద్రంలో తమకు రాజకీయ స్థానం అవసరం లేదని, బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడాన్నే తాము కోరుకుంటున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో I.N.D.I.A. కూటమిదే విజయమన్నారు. మంగళవారం జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ చేసే ప్రసంగమే ఆయనకు చివరిది కానుందన్నారు.
అటు, మౌలిక సదుపాయాల కల్పనలో మోదీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. జాతీయ రహదారుల ప్రాజెక్టులపై కాగ్ ఇచ్చిన నివేదికను ఖర్గే ప్రస్తావించారు. రాజకీయ ప్రత్యర్థుల గురించి మాట్లాడే ముందు తమ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నారు. బీజేపీ దోపిడీ, అవినీతి దేశాన్ని నరకం వైపు తీసుకు వెళతాయన్నారు.