Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ఢిల్లీలో మోకాలికి శస్త్ర చికిత్స
- చిరంజీవికి నీ-వాష్ సర్జరీ చేసినట్లుగా సమాచారం
- వారం రోజుల పాటు ఢిల్లీలోనే విశ్రాంతి తీసుకోనున్న చిరంజీవి
- ఈ నెల 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా ప్రారంభం
మెగాస్టార్ చిరంజీవి మోకాలికి శస్త్ర చికిత్స జరిగినట్టు సమాచారం. దేశ రాజధాని న్యూఢిల్లీలో మోకాలికి చిన్న ఆపరేషన్ చేయించుకున్న చిరు వారం రోజుల పాటు ఢిల్లీలోనే విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ తిరిగి వస్తారు. చిరంజీవికి నీ-వాష్ సర్జరీ చేసినట్లుగా తెలుస్తోంది. మోకాలిలో ఉన్న ఇన్ఫెక్షన్ను ఈ ఆపరేషన్ ద్వారా ఆర్థోప్లాస్టీ చేసి క్లియర్ చేస్తారు. ఈ నెల 22వ తేదీన చిరంజీవి పుట్టిన రోజు. అదే రోజున చిరంజీవి కొత్త సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమాకు చిరంజీవి కూతురు సుస్మిత కాగా, దర్శకుడు కల్యాణ్ కృష్ణ.