Hyderabad: భాగ్యనగరంలోని ఆ ప్రాంతవాసులకు అలర్ట్... రెండ్రోజులు నీటిసరఫరాలో అంతరాయం

Water supply to be interrupted in Hyderabad

  • శనివారం ఉదయం నుండి ఆదివారం మధ్యాహ్నం వరకు నీటిసరఫరాలో అంతరాయం
  • మంజీరా నీటి సరఫరా ఫేజ్-2లో మరమ్మతులు
  • కూకట్‌పల్లి, లింగంపల్లి, జగద్గిరిగుట్ట, అమీర్ పేట సహా పలుచోట్ల అంతరాయం

భాగ్యనగరవాసులకు అలర్ట్! వచ్చే శని, ఆదివారాలలో పైప్ లైన్ల మరమ్మతుల కారణంగా నగరంలో పలుచోట్ల తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. శనివారం ఉదయం నుండి ఆదివారం మధ్యాహ్నం వరకు అంతరాయం కలగనుంది. మంజీరా నీటి సరఫరా ఫేజ్-2లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) మరమ్మతులు చేపట్టనుంది.

కలబ్ గూర్ నుండి పటాన్ చెరు, పటాన్ చెరు నుండి హైదర్ నగర్ వరకు 1500 ఎంఎం డయా ఎంఎస్ పైప్ లైన్ మరమ్మతుల నేపథ్యంలో అగస్ట్ 19 ఉదయం 6 గంటల నుండి అగస్ట్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు అంటే 30 గంటల పాటు నీటి సరఫరా ఉండదు. ఎర్రగడ్డ, ఎస్సార్ నగర్, అమీర్ పేట, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్ పల్లి, మూసాపేట, జగద్గిరిగుట్ట, ఆర్సీపురం, అశోక్ నగర్, మియాపూర్, లింగంపల్లి, చందానగర్, దీప్తిశ్రీనగర్, మదీనాగూడ, బీరంగూడ, అమీన్ పుర ప్రాంతాల్లో నీటిసరఫరాకు అంతరాయం కలగనుంది.

  • Loading...

More Telugu News