Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ కు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సీబీఐ
- పశుగ్రాసం కుంభకోణం కేసులో లాలూకు జైలు శిక్ష
- లాలూకు బెయిల్ ఇచ్చిన ఝార్ఖండ్ హైకోర్టు
- బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్
పశుగ్రాసం కుంభకోణంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జైలు శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయట ఉన్నారు. ఈ నేపథ్యంలో ఝార్ఖండ్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ను సుప్రీంకోర్టులో సీబీఐ సవాల్ చేసింది. లాలూకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీంను కోరింది. ఈ అప్పీల్ ను ఆగస్ట్ 25న లిస్ట్ చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. మరోవైపు ఈ కేసులో గత ఫిబ్రవరిలో లాలూ ప్రసాద్ ను సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించింది.