chair: మడిస్తే మెట్లలా మారిపోయే 130 ఏళ్ల నాటి నిజాం కుర్చీ.. వీడియో ఇదిగో!
- నిజాం మ్యూజియంలో ఆకట్టుకుంటున్న కుర్చీ
- హైదరాబాద్‌ను చాలా ఏళ్ల పాటు పాలించిన నిజాంలు
- భారీ నిర్మాణాలతో పాటు చిన్న చిన్న కళలకూ ప్రోత్సాహం
హైదరాబాద్ సంస్థానాన్ని చాలా సంవత్సరాలు పాలించిన నిజాం రాజులు తెలంగాణ ప్రాంతంలో ఎన్నో గొప్ప నిర్మాణాలు చేపట్టారు. పెద్ద పెద్ద కోటలు, రిజర్వాయర్లు, ప్యాలెస్ లు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. వీటితో పాటు చిన్న చిన్న కళలనూ నిజాంలు ప్రోత్సహించారు. అలాంటివాటిలో నిజాం మ్యూజియంలో ఉన్న ఓ చెక్క కుర్చీ ఆకట్టుకుంటోంది. 130 ఏళ్ల కిందటిదైన ఈ కుర్చీని మలిస్తే మెట్లలా మారిపోతుంది. నిజాం మ్యూజియంలో దీన్ని చూసిన రాఘవేంద్ర సర్వం అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు.