Vaishnav Tej: 'ఆదికేశవ' న్యూ రిలీజ్ డేట్ ఇదే!

Adi Keshava Movie Update

  • వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన 'ఆదికేశవ'
  • ముందుగా అనుకున్న రిలీజ్ డేట్ ఈ నెల 18
  • కొత్తగా ప్రకటించిన విడుదల తేదీ నవంబర్ 10
  • కథానాయికగా సందడి చేయనున్న శ్రీలీల
  • కీలకమైన పాత్రలో మలయాళ స్టార్ జోజు జార్జ్

వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన 'ఉప్పెన' 100 కోట్ల క్లబ్ లో చేరిపోగా, ఆ తరువాత ఆయన చేసిన 'కొండపొలం' సినిమా మాత్రం అతి తక్కువ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఆయన నుంచి రావడానికి 'ఆదికేశవ' సినిమా రెడీ అవుతోంది. ఇది ఆయన కెరియర్ ను ప్రభావితం చేసే సినిమాగానే చెప్పుకోవాలి. 

సితార నాగవంశీ - సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకి శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ను టచ్ చేస్తూ సాగే కథ ఇది. ఈ సినిమాను ఈ నెల 18వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. ఆ డేట్ దిశగానే అప్ డేట్స్ వదులుతూ .. ప్రమోషన్స్ ను కూడా మొదలుపెడుతూ వెళ్లారు. 

అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా విడుదల తేదీని మార్చుకున్నారు. నవంబర్ 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. తాజాగా అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. శ్రీలీల కథానాయికగా మెరవనున్న ఈ సినిమాలో, జోజు జార్జ్ .. అపర్ణ దాస్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

  • Loading...

More Telugu News