super star: యూపీ సీఎం యోగితో కలిసి ‘జైలర్’ చూడనున్న రజనీకాంత్
- శనివారం మధ్యాహ్నం లక్నో చేరుకున్న సూపర్ స్టార్
- లక్నో విమానాశ్రయంలో మీడియాకు వివరాల వెల్లడి
- దేవుడి దయవల్ల సినిమా విజయం సాధించిందన్న రజనీ
సూపర్ స్టార్ రజనీకాంత్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలిసేందుకు శనివారం లక్నో చేరుకున్నారు. ఈ సందర్భంగా లక్నో విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ.. దేవుడి దయవల్ల జైలర్ సినిమా విజయం సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమాను యూపీ సీఎం యోగితో కలిసి చూసేందుకే తాను లక్నో వచ్చానని రజనీకాంత్ మీడియాకు తెలిపారు.
ఇటీవల విడుదలైన రజనీ కొత్త సినిమా జైలర్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాలోని ‘కావాలయ్యా.. ’ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. జపాన్ లోని రజనీకాంత్ ఫ్యాన్స్ ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. జపాన్ అంబాసిడర్ కూడా ఈ పాటకు కాలుకదిపిన వీడియో వైరల్ గా మారింది. కాగా, సినిమా విడుదల రోజు హిమాలయాలకు వెళ్లిన రజనీకాంత్.. శుక్రవారం వరకూ వివిధ ఆలయాలను సందర్శిస్తూ గడిపారు. యూపీ సీఎంను కలిసి ‘జైలర్’ సినిమాను వీక్షించేందుకు రజనీ శనివారం లక్నో చేరుకున్నారు.