Rahul Gandhi: బీజేపీ కోసం ప్రతి సంస్థలో ఆరెస్సెస్ తన వ్యక్తులను చొప్పిస్తోంది: రాహుల్ గాంధీ

RSS sending its followers in all systems says Rahul Gandhi
  • బీజేపీకి ఆరెస్సెస్ మాతృ సంస్థ అన్న రాహుల్
  • కేంద్ర మంత్రులెవరు వారి శాఖలను నిర్వహించడం లేదని వ్యాఖ్య
  • ఆరెస్సెస్ వ్యక్తుల సూచనల ఆధారంగానే శాఖలు నడుస్తున్నాయని ఆరోపణ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లడఖ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆరెస్సెస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలోని ప్రతి సంస్థలో తన మనుషులను ఆరెస్సెస్ చొప్పిస్తోందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీకి మాతృ సంస్థ ఆరెస్సెస్సేనని చెప్పారు. 

బీజేపీ కోసం ఆరెస్సెస్ అన్ని వ్యవస్థల్లో తన మనుషులను పెడుతోందని అన్నారు. కేంద్ర మంత్రులెవరూ వారి శాఖలను నడపడం లేదని, ఆయా శాఖల్లో ఆరెస్సెస్ నియమించిన వాళ్లు వాటిని నడుపుతున్నారని చెప్పారు. వారు సూచించిన విధంగానే శాఖలు నడుస్తున్నాయని అన్నారు. శాఖల్లో ఏం జరగాలనేది వారే సూచిస్తారని... ఈ విషయాన్ని మంత్రులను అడిగినా చెపుతారని వ్యాఖ్యానించారు.
Rahul Gandhi
Congress
BJP
RSS

More Telugu News