Talasani: జీహెచ్ఎంసీ పరిధిలో సెప్టెంబర్ 2 నుంచి డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ షురూ

Double Bedroom house distribution from Sep 2

  • జీహెచ్ఎంసీ పరిధిలో సెప్టెంబర్ 2 నుండి డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ
  • మొదటి విడతలో 8 ప్రాంతాల్లో 12వేలమంది అర్హులకు ఇళ్ల పంపిణీ
  • డ్రా పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్న తలసాని

జీహెచ్ఎంసీ పరిధిలో సెప్టెంబర్ 2వ తేదీ నుండి డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీని ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీపై అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు... మొదటి విడతలో ఎనిమిది ప్రాంతాల్లో 12వేల మంది అర్హులకు ఇళ్లను పంపిణీ చేస్తామన్నారు. ఇందుకు ఈ నెల 24వ తేదీన హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో డ్రా పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు.

దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలు గొప్పగా ఆత్మగౌరవంతో బతకాలనేదే కేసీఆర్ ఆలోచన అన్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఒక్క తెలంగాణలోనే అన్ని సౌకర్యాలతో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఉచితంగా ఇస్తున్నామన్నారు. కాగా, అర్హులైన పేద కుటుంబాలకు పంపిణీ చేయనున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, అందంగా తీర్చిదిద్దడం, పంపిణీ కోసం చేయాల్సిన ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు.

  • Loading...

More Telugu News