Best camera phones: బెస్ట్ కెమెరా ఫోన్ కావాలా..? మంచి ఆప్షన్లు ఇవే..
- కెమెరా లెన్స్ ఎంపిక కీలకం
- వివో ఎక్స్ 90ప్రో, శామ్ సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా
- వివో వీ27 ప్రో, ఒప్పో రెనో 10 ప్రో ప్లస్
- వీటిల్లో స్పష్టమైన చిత్రాలు
స్మార్ట్ ఫోన్ నేడు ప్రతి ఒక్కరికీ అవసరంగా మారిపోతోంది. ఫోన్ విషయంలో ఒక్కొక్కరి అభిరుచి ఒక్కో విధంగా ఉంటుంది. ఫోన్ కొనుగోలులో ప్రాధాన్యతలు వేర్వేరుగా ఉంటాయి. ముఖ్యంగా కెమెరాకు ప్రాధాన్యం ఇచ్చే వారు ఎక్కువగా కనిపిస్తుంటారు. మంచి కెమెరా సామర్థ్యాలతో కూడిన స్మార్ట్ ఫోన్ కోసం చూసే వారి ముందు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి.
వివో ఎక్స్90 ప్రో
ఈ ఫోన్ లోని జీస్ కెమెరా లెన్స్ మంచి పనితీరును ఇస్తాయి. లైటింగ్ తక్కువగా ఉన్న సందర్భాల్లోనూ మంచి ఫొటోలను తీసి ఇస్తుంది. వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ రెండు కెమెరాలు, అలాగే 12 మెగాపిక్సల్ కెమెరా కలిపి మొత్తం మూడు ఉన్నాయి. ముందు భాగంలో 32 మెగాపిక్సల్ కెమెరా ఏర్పాటైంది. 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ.84,999.
శామ్ సంగ్ ఎస్23 అల్ట్రా
మంచి కెమెరా ఫోన్లలో ఇది కూడా ఒకటి. స్నాప్ డ్రాగన్ 8వ జెనరేషన్ 2 చిప్ సెట్ తో వస్తుంది. వెనుక భాగంలో నాలుగు కెమెరాలు ఉంటాయి. 200 మెగాపిక్సల్ ప్రధాన కెమెరాతో, 12 మెగాపిక్సల్ కెమెరా, 10 మెగాపిక్సల్ రెండు సెన్సార్లు ఉన్నాయి. ముందు భాగంలో 12 మెగాపిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. దీని ధర రూ.1,24,999 నుంచి ప్రారంభం అవుతుంది.
వివో వీ27 ప్రో
స్లిమ్ గా కనిపిస్తుంది. కర్వ్ డ్ డిస్ ప్లేతో వస్తుంది. వెనుక భాగంలో 50 మెగాపిక్సల్, 8 మెగా పిక్సల్, 2 మెగా పిక్సల్ కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 50 మెగాపిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. మీడియాటెక్ డైమెన్సిటీ 8200 పై పని చేయనుంది. దీని ధర రూ.37,999 నుంచి ప్రారంభం అవుతోంది.
షావోమీ 13 ప్రో
వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ తో కూడిన మూడు కెమెరా లెన్స్ ను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 32 మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది. సెల్ఫీలను సైతం స్పష్టంగా తీసుకోవచ్చు. దీని ధర రూ.79,999 నుంచి ప్రారంభం అవుతుంది.
ఒప్పో రెనో 10 ప్రో ప్లస్
కెమెరా విషయంలో మెరుగైన పనితీరు ఇస్తుంది. తక్కువ లైటింగ్ లోనూ స్పష్టమైన ఫొటోలు తీసుకోవచ్చు. జూమ్ ఇన్ చేసినప్పటికీ పిక్సల్స్ అవుట్ అవ్వకుండా స్పష్టంగా ఉంటుంది. వెనుక భాగంలో 50 మెగాపిక్సల్, 8 మెగా పిక్సల్, 64 మెగాపిక్సల్ కెమెరా లెన్స్ ఏర్పాటు చేశారు. దీని ధర రూ.54,999.