Ramcharan: రామ్​ చరణ్ సినిమాలో విలన్‌గా విజయ్ సేతుపతి!

Ram Charan and Vijay Sethupathi are all set for a face off against each other
  • బుచ్చిబాబు సానతో సినిమాకు ఓకే చెప్పిన చరణ్
  • జనవరిలో మొదలు కానున్న షూటింగ్
  • ఉప్పెనలో విలన్‌గా నటించిన సేతుపతి
‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో గ్లోబల్ స్టార్‌‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో రామ్ చరణ్. ఈ సినిమా అఖండ విజయం తర్వాత శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్నాడు. తనకు పాప పుట్టడంతో కొన్ని రోజులు షూటింగ్ కు బ్రేక్ తీసుకున్న చరణ్ తిరిగి సెట్ లో చేరారు. ప్రస్తుతం హీరో, హీరోయిన్ తో పాటు కీలక పాత్రధారులు షూటింగ్ లో పాల్గొంటున్నారు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ప్యాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సగం పూర్తయింది. ఇది సెట్స్‌పై ఉండగానే ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ సినిమాకు చరణ్ ఓకే చెప్పాడు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం విజయ్ సేతుపతిని సంప్రదించగా ఆయన ఓకే చెప్పినట్టు టాలీవుడ్ సమాచారం. ఈ సినిమాలో విజయ్ ది ముఖ్యమైన పాత్రే కాకుండా విలన్ క్యారెక్టర్ అని తెలుస్తోంది. ఇప్పటికే ‘ఉప్పెన’ చిత్రంలో నటించిన సేతుపతి బుచ్చిబాబుపై నమ్మకంతో చరణ్ తో సినిమాకు ఒప్పుకున్నాడని తెలుస్తోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. ఒకవేళ సేతుపతి అంగీకరిస్తే మరో క్రేజీ కాంబినేషన్ అభిమానులను అలరించనుంది.
Ramcharan
Vijay Sethupathi
buchibabu sana
uppena

More Telugu News