Weapon: సత్యరాజ్, వసంత్ రవి ప్రధాన పాత్రధారులుగా 'వెపన్'... ఆకట్టుకుంటున్న టీజర్

Sathyaraj and Vasant Ravi action packed Weapon teaser gets huge response
  • గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వంలో యాక్షన్ మూవీ వెపన్
  • మిలియన్ స్టూడియో బ్యానర్ పై నిర్మాణం
  • ఇటీవలే టీజర్ విడుదల
  • అదిరిపోయే రేంజిలో యాక్షన్ సన్నివేశాలు
సీనియర్ నటుడు సత్యరాజ్, వసంత్ రవి ప్రధాన పాత్రధారులుగా నటిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'వెపన్'. ఎంఎస్ మంజూర్ సమర్పణలో మిలియన్ స్టూడియో బ్యానర్ పై గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రీసెంట్ గా విడుదల చేశారు. 

టీజర్ చూస్తే పూర్తిస్థాయి యాక్షన్ చిత్రమని అర్థమవుతుంది. సత్యరాజ్, వసంత్ రవి పాత్రలను వావ్ అనిపించేలా రూపొందించినట్లు స్పష్టమవుతుంది. ప్రభు రాఘవ్ సినిమాటోగ్రఫీ, గిబ్రాన్ నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్ గా నిలుస్తున్నాయి. 

సంక్షిప్తంగా ఈ చిత్ర కథాంశం ఏమిటంటే... సూపర్ హ్యూమన్ గురించి అన్వేషణ జరుగుతుంటుంది. అసలా సూపర్ హ్యుమన్ ఎవరు?... సత్యరాజా?  వసంత్ రవినా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే... అనేలా ట్రైలర్ ఉంది. సినిమా ట్రైలర్, ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. 

ఈ చిత్రంలో సత్యరాజ్, వసంత్ రవితో పాటు తాన్యా హోప్, యషికా ఆనందర్, రాజీవ్ మీనన్, రాజీవ్ పిళ్లై, మైమ్ గోపి, కణిత, గజరాజ్, సయ్యద్ సుభాన్, భరద్వాజ్ రంగన్ తదితరులు నటించారు.
Weapon
Movie
Teaser
Sathyaraj
Vasant Ravi

More Telugu News