Pawan Kalyan: భారీ షెడ్యూల్ కు సిద్ధమవుతున్న పవన్ కల్యాణ్ కొత్త చిత్రం
- పవన్, హరీశ్ శంకర్ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్
- పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో పవన్ కల్యాణ్
- సెప్టెంబరు 5 నుంచి భారీ షెడ్యూల్
- కీలక సన్నివేశాల కోసం భారీ సెట్ నిర్మాణం
పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడదే హిట్ కలయికలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇందులో పవన్ కల్యాణ్ ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర పోషిస్తున్నారు.
కాగా, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అప్ డేట్ పంచుకుంది. సెప్టెంబరు 5 నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ భారీ షెడ్యూల్ జరగనుందని వెల్లడించింది. పవన్ కల్యాణ్ కూడా పాల్గొనే కొన్ని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నట్టు తెలిపింది. అందుకోసం ఓ భారీ సెట్ నిర్మించినట్టు పేర్కొంది.
నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన యువ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.