Chiranjeevi: మా 'చిరుత' అంటూ తండ్రికి బర్త్ డే విషెస్ తెలిపిన రామ్ చరణ్

Ram Charan conveys birthday wishes to his dad chiranjeevi
  • ఇవాళ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు
  • సోషల్ మీడియాలో పోస్టుల వెల్లువ
  • ఆసక్తికర ఫొటోతో పోస్టు పెట్టిన రామ్ చరణ్, ఉపాసన
మెగాస్టార్ చిరంజీవి ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతూ పెట్టిన పోస్టులే దర్శనమిస్తున్నాయి. 

తాజాగా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా తండ్రికి బర్త్ డే విషెస్ తెలుపుతూ ఇన్ స్టాగ్రామ్ లో ఆసక్తికర పోస్టు పెట్టారు. చరణ్ పోస్టులో... మనవరాలు క్లీంకారను అపురూపంగా చేతుల్లోకి తీసుకున్న చిరంజీవిని చూడొచ్చు. 

"మా ప్రియాతి ప్రియమైన 'చిరుత' (చిరంజీవి తాత)కు ఆనందాల పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనపై మా ప్రేమాభిమానాలకు అంతులేదు. కొణిదెల కుటుంబంలో ఇటీవల వచ్చిన బుజ్జాయి కూడా ఆయనపై ప్రేమ కురిపిస్తుంది" అంటూ రామ్ చరణ్ ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొన్నారు. ఉపాసన కూడా ఇదే సందేశాన్ని పంచుకున్నారు.
Chiranjeevi
Birthday
Ram Charan
Upasana
Klin Kaara
Konidela

More Telugu News