Nara Lokesh: మేం చేసిన తప్పు వలన అతడు ఎమ్మెల్యే అయ్యాడు: నారా లోకేశ్

Lokesh fires on Krishna district YCP leaders

  • గన్నవరంలో నారా లోకేశ్ యువగళం సభ
  • వాడీవేడిగా ప్రసంగించిన లోకేశ్
  • వైసీపీ కుక్కలు అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన లోకేశ్
  • నేను రాకముందే ప్యాంట్లు తడుపుకున్నారంటూ వ్యాఖ్యలు
  • నన్ను ప్రశ్నించే హక్కు ఈ కుక్కలకు ఎవరిచ్చారంటూ ఆగ్రహం

టీడీపీ యువనేత నారా లోకేశ్ గన్నవరం సభలో వాడీవేడిగా ప్రసంగించారు. వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా వైసీపీ నేతలు పిరికి సన్నాసులు అని విమర్శించారు. 

"ఇతర జిల్లాల్లో వైసీపీ కుక్కలు నా పాదయాత్ర పూర్తయిన తరువాత మొరిగేవి. కృష్ణా జిల్లా వైసీపీ కుక్కలు నేను జిల్లాలో అడుగుపెట్టకముందే ప్యాంట్లు తడుపుకున్నాయి" అంటూ ఎద్దేవా చేశారు. 

"లోకేశ్ క్షమాపణ చెప్పి జిల్లాలో అడుగుపెట్టాలి అని వైసీపీ కుక్కలు మొరిగాయి. అమ్మ లాంటి అమరావతిని చంపేసిన ఈ కుక్కలకు నన్ను ప్రశ్నించే హక్కు ఎవడిచ్చాడు? అంటూ లోకేశ్ మండిపడ్డారు. పుట్టిన గడ్డకి జగన్ అన్యాయం చేస్తుంటే చప్పట్లు కొట్టిన కుక్కలు మనకి నీతులు చెబుతున్నాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చరిత్రలో ఎప్పుడూ లేదు!

చరిత్ర లో ఎప్పుడూ లేని విధంగా కృష్ణా జిల్లాలో ఎందుకూ పనికిరాని నలుగురు మంత్రులు అయ్యారు. ఒకడు సన్న బియ్యం సన్నాసి. క్యాసినోలు, గుట్కాపై తప్ప వాడికి ఏ అంశం పైనా అవగాహన ఉండదు. సన్న బియ్యం సన్నాసి చాలా పెద్ద తప్పు చేశాడు. రాజకీయాలతో సంబంధం లేని నా తల్లిని అవమానించాడు. వాడిని డ్రాయర్ పై నిలబెట్టి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లే బాధ్యత నాది. 

రాముడు తల నరికేస్తే చూసి నవ్వుకునేవాడు దేవాదాయశాఖ మంత్రి అయ్యాడు. మాడిపోయిన పల్లీకి దేవాలయాలను అభివృద్ధి చెయ్యడం తెలియదు. కొబ్బరి చిప్పలు ఎత్తుకుపోవడంలో ఆయన ఎక్స్ పర్ట్. 

ఇంకో ఆయన పనికిమాలిన నాని. అందుకే పదవి పోయింది. అధికారుల అంతు చూస్తా, జగన్ ఇంటి ముందు ధర్నా చేస్తా అంటూ పిచ్చోడిలా తిరుగుతున్నాడు. ముగ్గురు మంత్రులు పోయారు నాలుగో వాడు వచ్చాడు... జోకర్ జోగి. ఒక్క ఇల్లు కట్టడం చేతకాని జోకర్ జోగి ప్రతిపక్ష నేత ఇంటిపై రాళ్లు వెయ్యడానికి వస్తాడు.

ఆ పిల్ల సైకో మహానటుడు!

టీడీపీ కంచుకోట గన్నవరం. గన్నవరాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీనే. పుచ్చల పల్లి సుందరయ్య గారి లాంటి గొప్ప వ్యక్తులు, దాసరి బాలవర్ధన్ లాంటి గొప్ప నాయకులు గన్నవరం ఎమ్మెల్యేలుగా పనిచేశారు. 

ఇంత గొప్ప చరిత్ర ఉన్న గన్నవరంలో మేము చేసిన తప్పు వలన ఒక పిల్ల సైకో ఎమ్మెల్యే అయ్యాడు. ఈ పిల్ల సైకో మహా నటుడు. నేను మంత్రిగా ఉన్నప్పుడు సార్ సార్ అంటూ ఛాంబర్ కి వచ్చేవాడు. గౌరవంగా కూర్చోమన్నా నిలబడే ఉండేవాడు. ఈ పిల్ల సైకో పార్టీని వదిలిపెట్టి పోయాడు. 2012 సన్న బియ్యం సన్నాసి పోవడంతో సగం దరిద్రం పోయింది. ఇంకో సగం 2019లో పిల్ల సైకో పోవడంతో పార్టీకి పట్టిన దరిద్రం పూర్తిగా పోయింది. 

ఈ పిల్ల సైకో పెద్ద తప్పు చేశాడు. దేవాలయం లాంటి గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి చేసి తగలబెట్టాడు. గెలిపించిన క్యాడర్ పైనే కేసులు పెట్టించాడు.  పార్టీ మారి పిల్ల సైకో పీకింది ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. పెద్ద సైకోని ఆదర్శంగా తీసుకుని దోచుకుంటున్నాడు. 

పిల్ల సైకో... నువ్వు భయంతో బ్రతికే రోజులు దగ్గర్లో ఉన్నాయి. పిల్ల సైకోకి కరెంట్ షాక్ ట్రీట్ మెంట్ నేను ఇస్తా. గన్నవరంలో గెలిచేది టీడీపీనే... నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేది టీడీపీనే.

పందికి పాండ్స్ వాసన తెలుస్తుందా?... వీళ్లూ అంతే!

పందికి పాండ్స్ వాసన తెలుస్తుందా? అలాగే కృష్ణా జిల్లా వైసీపీ నాయకులకు అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తుందా? కృష్ణా జిల్లాకి చంద్రబాబు 17 వేల మందికి ఉద్యోగాలు కల్పించే హెచ్ సీఎల్ తీసుకొస్తే జగన్ క్యాసినో, పేకాట క్లబ్బు తీసుకొచ్చాడు. 

మేధా టవర్స్ లో ఐటీ కంపెనీలతో పాటు జిల్లాకు అనేక ఐటీ కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాం. జగన్ ఆ కంపెనీలను ఇతర రాష్ట్రాలకు తరిమేస్తున్నాడు. జక్కంపూడి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసాం. జెడ్ సిటీ పేరుతో 7 వేల ఇళ్లు నిర్మించాం. 

మోడల్‌ ఇండస్ట్రీయల్‌ పార్కు ఏర్పాటు చేసి అశోక్‌ లేలాండ్‌, మోహన్‌ స్పిన్నింగ్‌ వంటి పరిశ్రమలతో దాదాపు 70 ప్లాస్టిక్‌ పరిశ్రమలు, 45 ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, 694 చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలకు భూములు కేటాయించాం. ఇప్పుడు జగన్ ఆ కంపెనీలను ఇతర రాష్ట్రాలకు తరిమేస్తున్నాడు. 

వైసీపీ నాయకులకు నేను సవాల్ విసురుతున్నా. 15 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడు వస్తారో రండి, టైం అండ్ డేట్ మీరే ఫిక్స్ చేయండి. సింగిల్ గా వస్తా. ఎవరి హయాంలో కృష్ణా జిల్లా అభివృద్ధి జరిగిందో చర్చిద్దాం. 

గత ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో 14 సీట్లు వైసీపీకి ఇచ్చారు. జగన్ చేసింది ఏంటి... చేతిలో చిప్ప పెట్టాడు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 16 సీట్లూ టీడీపీకి ఇవ్వండి. నిజమైన అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తాం.

  • Loading...

More Telugu News