Madurai Bench: భార్య ప్రసూతికి భర్తకు సెలవు ఇవ్వాల్సిందే: మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం
- ప్రసూతి సమయంలో భార్య పక్కన ఉండేందుకు 90 రోజుల సెలవులు పెట్టిన సీఐ
- తొలుత మంజూరు చేసి ఆ తర్వాత మెమో ఇచ్చిన ఉన్నతాధికారులు
- మధురై ధర్మాసనాన్ని ఆశ్రయించిన సీఐ
- మెమోను రద్దు చేస్తూ ఉత్తర్వులు
భార్య ప్రసూతి సమయంలో భర్తకు సెలవు మంజూరు చేయాల్సిందేనని మద్రాస్ హైకోర్టులోని మధురై ధర్మాసనం పేర్కొంది. గర్భంతో ఉన్న తన భార్య ప్రసూతి సమయంలో ఆమె పక్కన ఉండేందుకు తనకు మే 1 నుంచి 90 రోజులు సెలవులు కావాలంటూ తెన్‌కాశీ జిల్లా కడైయం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శరవణ్ ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు.
తొలుత సెలవులు మంజూరు చేసిన ఉన్నతాధికారులు ఆ తర్వాత మెమో ఇవ్వడంతో ఆయన మద్రాస్ హైకోర్టులోని మధురై ధర్మాసనాన్ని ఆశ్రయించారు. విచారించిన ధర్మాసనం ప్రసూతి సమయంలో భార్య బాగోగులను చూసుకోవాల్సిన అవసరం భర్తకు ఉందని, కాబట్టి ఆయన సెలవు దరఖాస్తును పరిశీలించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్‌దారుడు బాధ్యతాయుతమైన భర్తగా వ్యవహరించారని, కాబట్టి ఆయనకు ఇచ్చిన మెమోను రద్దు చేస్తున్నట్టు పేర్కొంటూ మెమోను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.