Chandrayaan-3: చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభం... దేశవ్యాప్తంగా ఉత్కంఠ

Chandrayaan 3 Begins Final Descent To Moon

  • బుధవారం సాయంత్రం గం.5.44కు ప్రారంభమైన ప్రక్రియ
  • చంద్రుడి ఉపరితలం వైపుగా విక్రమ్ ల్యాండర్ ప్రయాణం
  • శాస్త్రవేత్తలు, కోట్లాదిమంది ప్రజల్లో క్షణం క్షణం ఉత్కంఠ

చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రక్రియ బుధవారం సాయంత్రం గం.5.44 నిమిషాలకు ప్రారంభమైంది. చంద్రుడి ఉపరితలం వైపుగా విక్రమ్ ల్యాండర్ ప్రయాణం ప్రయాణిస్తోంది. ల్యాండర్ నుండి వస్తోన్న సిగ్నల్స్‌ను ఇస్రో శాస్ర్తవేత్తలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. బెంగళూరు కేంద్రంలో శాస్త్రవేత్తలు క్షణం క్షణం ఉత్కంఠతో పరిస్థితిని అంచనా వేస్తున్నారు. చంద్రయాన్-3 ప్రయోగాన్ని దేశవ్యాప్తంగా అనేక పాఠశాలల్లో విద్యార్థులు చూసేందుకు ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లు చేశారు. చంద్రయాన్ సాఫ్ట్ ల్యాండింగ్‌పై దేశవ్యాప్తంగా.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

  • Loading...

More Telugu News