Chandrayaan-3: చంద్రయాన్-3కి సాయపడ్డ ప్రైవేటు కంపెనీల షేర్లకు రెక్కలు

Shares of private companies surge after after chandrayaan 3 success

  • ప్రైవేటు రంగంపై చంద్రయాన్-3 విజయంతో సానుకూల ప్రభావం
  • ఈ మిషన్‌లో కీలక పాత్ర పోషించిన సెంటమ్, స్పేస్ టెక్నాలజీస్ సంస్థ షేర్ల లాభాల బాట
  • చంద్రయాన్-3 బూస్టర్ భాగాలను సరఫరా చేసిన ఎల్ అండ్ టీ
  • ఎలక్ట్రానిక్ వస్తువులను సరఫరా చేసిన సెంటమ్ ఎలక్ట్రానిక్స్

చంద్రయాన్-3 విజయం ప్రైవేటు రంగ పరిశోధన సంస్థలపై సానుకూల ప్రభావం చూపించింది. ఈ మిషన్‌లో కీలక పాత్ర పోషించిన పలు ప్రైవేటు అంతరిక్ష పరిశోధన, రక్షణ రంగ, ఎలక్ట్రానిక్స్ సంస్థల షేర్లు జిగేల్మన్నాయి. సెంటమ్ ఎలక్ట్రానిక్స్ షేర్లు 15 శాతం మేర లాభపడగా, స్పేస్ టెక్నాలజీస్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ షేర్లు 3.6-5.5 శాతం మేర పెరిగాయి. భారత్ ఫోర్జ్, ఆస్ట్రా మైక్రోవేవ్, ఎల్ అండ్ టీ సంస్థల షేర్లు 1.5 నుంచి 3 శాతం మేరు పుంజుకున్నాయి. వీటిల్లో కొన్ని షేర్లు ఏడాది కాల గరిష్ఠ విలువకు చేరుకోవడం గమనార్హం. 

చంద్రయాన్-3కి కీలకమైన క్రిటికల్ బూస్టర్ భాగాలను ఎల్ అండ్ టీ సరఫరా చేసింది. ల్యాండర్, ప్రొపల్షన్ మాడ్యూల్స్‌లోని బ్యాటరీలను భేల్ తయారు చేసింది. ఎమ్‌టార్ టెక్నాలజీస్ చంద్రయాన్-3కి అవసరమైన ఇంజన్లు, బూస్టర్ పంపులను అందించింది. మిధానీ కీలక లోహ మిశ్రమాలను చంద్రయాన్-3 కోసం సిద్ధం చేసింది. చంద్రయాన్-3లో వినియోగించిన పలు ఎలక్ట్రానిక్ వస్తువులను సెంటమ్ ఎలక్ట్రానిక్స్ సరఫరా చేసింది. హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్, పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్, వాల్‌చందర్ ఇండస్ట్రీస్‌తో పాటూ గోద్రేజ్ కంపెనీ, గోద్రేజ్ ఎయిరోస్పేస్ కూడా చంద్రయాన్-3కి కావాల్సిన పలు కీలక విడిభాగాలను సరఫరా చేశాయి.

  • Loading...

More Telugu News