ISRO chief: సూర్యుడిపై పరిశోధనల గురించి ఇస్రో చీఫ్ కీలక ప్రకటన

ISRO chief S Somanath on Aditya L1 and Gaganyaan mission

  • ఆదిత్య మిషన్‌ను సెప్టెంబర్‌‌ మొదటివారంలో చేపట్టనున్నామన్న సోమనాథ్
  • గగన్‌యాన్‌ ఇంకా ప్రోగ్రెస్‌లో ఉందని వెల్లడి
  • 2025లో రోదసిలోకి మనిషిని పంపిస్తామని ప్రకటన

చంద్రయాన్–3 విజయంతో తిరుగులేని రికార్డును నెలకొల్పింది ఇస్రో. దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా నిలిచింది. ఈ జోష్‌లోనే మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. సూర్యుడిపై చేపట్టనున్న ఆదిత్య మిషన్‌ గురించి ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య మిషన్‌ను సెప్టెంబర్‌‌ మొదటివారంలో చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రయోగం కోసం ఆదిత్య మిషన్‌ సిద్ధమవుతోందని చెప్పారు. గగన్‌యాన్‌ ఇంకా ప్రోగ్రెస్‌లో ఉందని చెప్పారు.  

సెప్టెంబర్‌‌ లేదా అక్టోబర్‌‌లో ఒక మిషన్ చేపడుతామని ఇస్రో చీఫ్ సోమనాథ్ ప్రకటించారు. దారి తర్వాత క్రూ మాడ్యూల్, క్రూ ఎస్కేప్ సామర్థ్యాన్ని పరీక్షిస్తామని వెల్లడించారు. పలు టెస్టు మిషన్ల తర్వాత 2025లో రోదసిలోకి మానవసహిత గగన్‌యాన్‌ మిషన్ ను చేబదతామని ప్రకటించారు. ఇక చంద్రయాన్ ల్యాండర్, రోవర్ చక్కగా పని చేస్తున్నాయని తెలిపారు.

  • Loading...

More Telugu News