Stock Market: నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 180 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 57 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
- 5 శాతం వరకు పతనమైన జియో ఫైనాన్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. చంద్రయాన్ సక్సెస్ తో ఈ ఉదయం మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 180 పాయింట్లు కోల్పోయి 65,252కి పడిపోయింది. నిఫ్టీ 57 పాయింట్లు నష్టపోయి 19,386 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఏసియన్ పెయింట్స్ (1.68%), ఇన్ఫోసిస్ (1.19%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.65%), నెస్లే ఇండియా (0.39%), యాక్సిస్ బ్యాంక్ (0.29%).
టాప్ లూజర్స్:
జియో ఫైనాన్స్ (-4.99%), రిలయన్స్ (-1.76%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.32%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-1.19%), ఎల్ అండ్ టీ (-1.10%).