Allu Arjun: తనయుడు జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికవడంపై అల్లు అరవింద్ ఏమన్నారంటే..!

Allu Aravind very happy with best actor award for allu arjun
  • స్టైలిష్ స్టార్ నివాసం వద్ద కోలాహలం
  • అద్భుతాన్ని తీసుకువచ్చిన వారికి అల్లు అరవింద్ కృతజ్ఞతలు
  • అల్లు అర్జున్ మా ఫ్యామిలీని పతాకస్థాయికి తీసుకెళ్లాడని ప్రశంస
2021వ సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డును పుష్ప సినిమాలో నటనకు అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు. తెలుగుకు ఇప్పటి వరకు ఉత్తమ నటుడి అవార్డు రాలేదు. ఏడు దశాబ్దాల్లో మొదటిసారి అల్లు అర్జున్‌కు వచ్చింది. దీంతో స్టైలిష్ స్టార్ నివాసం వద్ద కోలాహలం నెలకొంది. పుష్ప హీరోకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అవార్డు రావడంపై అల్లు అరవింద్ స్పందించారు.

ఇంటి వద్ద గుమికూడిన మీడియా ప్రశ్నలు వేయబోగా.. అల్లు అరవింద్ స్పందిస్తూ.. ప్రశ్నలు, సమాధానాలు లేవు.. 69 ఏళ్లుగా తెలుగు పరిశ్రమకు రాని ఒక అద్భుతాన్ని తీసుకువచ్చిన ఈ తెలుగు ప్రేక్షకులకు, సినిమా తీసిన నిర్మాతలకు, దర్శకులకు, ఇతర సినిమా బృందానికి, మా ఫ్యామిలీని పతాకస్థాయికి తీసుకువెళ్లిన మా అబ్బాయికి కృతజ్ఞతలు అన్నారు.

కాగా, అల్లు అర్జున్ నివాసానికి పుష్ప సినిమా నిర్మాతలు వచ్చారు. ఈ సందర్భంగా స్టైలిష్ స్టార్‌ను కౌగిలించుకొని ఆనందం వ్యక్తం చేశారు. అల్లు అరవింద్ పుత్రోత్సాహంతో కనిపించారు.
Allu Arjun
allu aravind
Tollywood
national film fare awards

More Telugu News