Telangana: సచివాలయానికి గవర్నర్ తమిళిసై.. ఒక్కో అంతస్తు చూపించి వివరించిన కేసీఆర్

Govenor Tamilisai in telangana secretariat
  • ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన గవర్నర్ తమిళిసై
  • సచివాలయాన్ని పరిశీలించి బాగుందని ప్రశంస
  • శాలువా కప్పి సత్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం రాష్ట్ర సచివాలయాన్ని పరిశీలించారు. అనంతరం సచివాలయ నిర్మాణం చాలా బాగుందని ప్రశంసించారు. ఇక్కడి ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవానికి ఆమె వచ్చారు. సచివాలయానికి వచ్చిన గవర్నర్‌కు సీఎం కేసీఆర్, మహిళా మంత్రులు పుష్పగుచ్ఛం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. గవర్నర్‌కు సచివాలయంలోని ఒక్కో అంతస్తును చూపించి, వాటి గురించి ముఖ్యమంత్రి వివరించారు. అనంతరం శాలువా కప్పి సత్కరించారు. మహిళా మంత్రులు కూడా బొట్టు పెట్టి సంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. అటు తర్వాత కాసేపు మాట్లాడుకొని, సీఎం కేసీఆర్ సహా మంత్రులు.. ఆమెను కారు వద్దకు తోడ్కొని వచ్చి వీడ్కోలు పలికారు.
Telangana
Governor
Tamilisai Soundararajan
KCR
telangana Secretariat

More Telugu News