Sourav Ganguly: వన్డే ప్రపంచకప్ కు గంగూలీ సెలెక్ట్ చేసిన టీమిండియా జట్టు ఇదే!
- అక్టోబర్ లో ఇండియాలో జరగనున్న వన్డే ప్రపంచకప్
- తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, సంజూ శాంసన్ లకు చోటు కల్పించని దాదా
- కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లకు చోటు
అక్టోబర్ లో వన్డే ప్రపంచకప్ జరగబోతోంది. అక్టోబర్ 8న చెన్నైలో ఆస్ట్రేలియాపై ఇండియా తొలి మ్యాచ్ ఆడబోతోంది. ఈ నేపథ్యంలో తన ఫేవరెట్ టీమిండియా జట్టును మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించారు. ఆసియా కప్ కు ఎంపికైన తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, సంజూ శాంసన్ లకు గంగూలీ తన జట్టులో స్థానం కల్పించలేదు. గాయాల నుంచి కోలుకుని జట్టులో స్థానం సంపాదించిన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కు దాదా స్థానం కల్పించారు.
బ్యాట్స్ మెన్లుగా రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ లకు గంగూలీ చోటు కల్పించారు. స్పెషలిస్ట్ వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్ కు అవకాశం ఇచ్చారు. కేఎల్ రాహుల్ ఆప్షనల్ కీపర్ గా ఉంటాడని తెలిపారు. ఆల్ రౌండర్ల జాబితాలో హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్సర్ పటేల్ లకు చోటు కల్పించారు. కుల్దీప్ యాదవ్ ను స్పిన్ ఆప్షన్ గా తీసుకున్నారు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ లకు చోటు కల్పించారు.
మరోవైపు జట్టులో ఎవరైనా ఏ సమస్యతోనైనా వైదొలగితే వారి స్థానంలో వచ్చేందుకు ముగ్గురిని బ్యాక్ అప్ ప్లేయర్లుగా గంగూలీ సూచించారు. తిలక్ వర్మ (బ్యాట్స్ మెన్), ప్రసిద్ధ్ కృష్ణ (ఫాస్ట్ బౌలర్), యజువేంద్ర చాహల్ (స్పిన్నర్)లను బ్యాక్ అప్ ప్లేయర్లుగా చెప్పారు.
గంగూలీ ప్రపంచకప్ టీమ్:
రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్.