Amit Shah: తెలంగాణలో అమిత్ షా ఒక్కరోజు పర్యటన షెడ్యూల్ ఖరారు
- రేపు తెలంగాణకు వస్తున్న కేంద్ర హోంమంత్రి
- భద్రాచలం రాములవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు
- ఖమ్మం బహిరంగ సభకు హాజరు
- బీజేపీ కోర్ కమిటీతో సమావేశం
తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రేపు (ఆగస్టు 27) తెలంగాణలో అమిత్ షా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇందులో ఖమ్మం బహిరంగ సభ కూడా ఉంది. రైతు గోస-బీజేపీ భరోసా పేరిట నిర్వహించే ఈ సభలో పలువురు నేతలు అమిత్ షా సమక్షంలో కాషాయ కండువాలు కప్పుకుంటారని తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం 2.25 గంటల నుంచి సాయంత్రం 6.25 గంటల వరకు అమిత్ షా తెలంగాణ గడ్డపై బిజీగా గడపనున్నారు.
- ఢిల్లీ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 1.25 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు చేరిక.
- గన్నవరం నుంచి హెలికాప్టర్ లో మధ్యాహ్నం 2.10 గంటలకు కొత్తగూడెం రాక.
- అక్కడ్నించి రోడ్డు మార్గంలో భద్రాచలం పయనం.
- మధ్యాహ్నం 2.40 గంటల వరకు భద్రాచలం సీతారాముల ఆలయంలో ప్రత్యేక పూజలు
- తిరిగి భద్రాచలం నుంచి రోడ్డు మార్గంలో కొత్తగూడెం చేరిక. అక్కడ్నించి మధ్యాహ్నం 2.55 గంటలకు బీఎస్ఎఫ్ హెలికాప్టర్ లో ఖమ్మం పయనం.
- మధ్యాహ్నం 3.30 గంటలకు ఖమ్మం చేరిక.
- మధ్యాహ్నం 3.45 గంటల నుంచి 4.35 గంటల వరకు ఖమ్మంలో జరిగే రైతు గోస-బీజేపీ భరోసా బహిరంగ సభకు హాజరు.
- అనంతరం బీజేపీ కోర్ కమిటీ సమావేశం.
- సాయంత్రం 5.45 గంటలకు హెలికాప్టర్ లో గన్నవరం చేరిక.
- గన్నవరం నుంచి సాయంత్రం 6.25 గంటలకు ఢిల్లీ తిరుగు ప్రయాణం.