Devineni Uma: దేవినేని ఉమా, కిషోర్ కుమార్ రెడ్డి, పులివర్తి నానిలకు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు

AP High Court grants bail to Devineni Uma Nallari Kishore Kumar Reddy

  • అంగళ్లు, పుంగనూరు అల్లర్ల కేసులో ముందస్తు బెయిల్ మంజూరు
  • నాలుగు వారాల పాటు అన్నమయ్య జిల్లాకు వెళ్లకూడదని షరతు
  • ప్రతి ఆదివారం కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని ఆదేశం

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అంగళ్లు, పుంగనూరు అల్లర్ల కేసులలో టీడీపీ నేతలు దేవినేని ఉమా, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పులివర్తి నాని, చల్లా బాబులకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే పుంగనూరు నియోజకర్గ ఇన్ఛార్జీ చల్లా బాబుపై నమోదైన 7 కేసుల్లో కేవలం 4 కేసులకు మాత్రమే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరో మూడు కేసుల్లో బెయిల్ నిరాకరించింది. బెయిల్ మంజూరైన దేవినేని, నల్లారి, పులివర్తి నానిలు నాలుగు వారాల పాటు అన్నమయ్య జిల్లాకు వెళ్లకూడదని షరతు విధించింది. ప్రతి ఆదివారం కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని ఆదేశించింది. 

మరోవైపు ఈ ఘటనలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబుపై కూడా కేసులు నమోదయ్యాయి. అయితే, తాను ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించనని ఆయన ముందే స్పష్టంగా చెప్పారు. తమపై దాడి చేసి, తమపైనే కేసులు పెట్టారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News